Bachupally Fire Accident: హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రగతినగర్ నుంచి బాచుపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న మై స్పేస్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
ఆరు ఫర్నిచర్ దుకాణాలు దగ్ధం: రోడ్డు పక్కనే వరుసగా ఉన్న సుమారు 6 ఫర్నిచర్ దుకాణాలకు మంటలు వేగంగా వ్యాపించాయి. దుకాణాల్లో కలప, కుషన్లు వంటివి ఉండటంతో మంటలు ఆకాశాన్నంటాయి. ఈ ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదైంది.
Also read-IPL 2026 Tickets: ఐపీఎల్ టికెట్ల విక్రయాలపై మల్కాజ్‌గిరి పోలీసుల ఆపరేషన్.. ముఠా అరెస్ట్
నియంత్రణలోకి మంటలు: సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సకాలంలో స్పందించడంతో మంటలు పక్కనే ఉన్న ఇతర నిర్మాణాలకు వ్యాపించకుండా అరికట్టగలిగారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

