HomeTop StoriesHyderabad: నేడు హనుమాన్ శోభాయాత్ర.. ఆధ్యాత్మిక శోభతో మరుమోగనున్న భాగ్యనగరం!

Hyderabad: నేడు హనుమాన్ శోభాయాత్ర.. ఆధ్యాత్మిక శోభతో మరుమోగనున్న భాగ్యనగరం!

Hanuman Jayanti: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుంది. నగరంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద బైక్ ర్యాలీని నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకతో నగరం మొత్తం కాషాయమయం కానుంది.

- Advertisement -

ర్యాలీ వివరాలు: హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ మందిరంలో ప్రత్యేక పూజల నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుండే శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. ఆధ్యాత్మిక శోభతో సుమారు 12 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగనుంది. నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ మీదుగా సాగనున్న ఈ యాత్ర తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద ముగుస్తుంది.

Also read-National Awards: తెలంగాణ పల్లెల జోరు.. మోతుకుపల్లి, ఫసల్వాడికి జాతీయ పురస్కారాలు!

కట్టుదిట్టమైన ఏర్పాట్లు: ఈ ర్యాలీలో వేలాది మంది భక్తులు తమ ద్విచక్ర వాహనాలతో పాల్గొననున్నారు. 12 కిలోమీటర్ల మేర జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో నగరం దద్దరిల్లనుంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా నిర్వాహక కమిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. భజరంగబలి నామస్మరణతో భాగ్యనగరాన్ని భక్తిపారవశ్యంలో ముంచెత్తేందుకు యువత, భక్తులు ఇప్పటికే సిద్ధమయ్యారు. దీంతో ఈ ర్యాలీ జరిగే ప్రాంతంలో ఉదయం నుంచే హనుమాన్ భక్తులతో సందడి వాతావరణం నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News