HomeTop StoriesSRH vs RCB: ఉప్పల్‌ స్టేడియంలో హై ఓల్టేజ్‌ మ్యాచ్‌.. మెట్రో వేళలు పొడిగింపు

SRH vs RCB: ఉప్పల్‌ స్టేడియంలో హై ఓల్టేజ్‌ మ్యాచ్‌.. మెట్రో వేళలు పొడిగింపు

Uppal IPL SRH vs RCB: ఈరోజు ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియం వేదికగా ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్‌ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. ఐపీఎల్‌ 2026 సీజన్‌ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆర్సీబీ.. హైదరాబాద్‌తో తలపడగా ఘన విజయం సాధించింది. ఈ రోజు చివరి లీగ్‌ మ్యాచ్‌లో అదే విక్టరీని రిపీట్‌ చేయాలని రజత్‌ సేన ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు హోం గ్రౌండ్లో ఈ మ్యాచ్‌లో గెలిచి రివెంజ్‌ తీర్చుకోవాలని సన్‌రైజర్స్‌ ఎదురుచూస్తోంది. భీకర బ్యాటింగ్‌ లైనప్‌ ఉన్న ఈ రెండు జట్ల పోటీకి స్టేడియం దద్దరిల్లడం పక్కా అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కోహ్లీ ఆట కోసం ఆర్సీబీ ఫ్యాన్స్‌, అభిషేక్‌, క్లాసెన్‌ మెరుపులు చూసేందుకు ఫ్యాన్స్‌ పోటెత్తుతున్నారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/sports-news/gujarat-titans-beat-chennai-super-kings-by-89-runs-ipl-2026/

గెలుపు తప్పనిసరి

కాగా, ఇప్పటికే 18 పాయింట్లతో ఆర్‌సీబీ టేబుల్‌ టాపర్‌గా ఉండగా.. గుజరాత్‌ టైటాన్స్‌, హైదరాబాద్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్‌లై బెంగళూరుపై హైదరాబాద్‌ భారీ తేడాతో గెలిచినట్లయితే రెండో స్థానానికి చేరుతుంది. లేదంటే మూడో స్థానంలో ఉండిపోతుంది. ఇక ఆర్‌సీబీ గెలిచినా ఓడినా మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ కారణంగా మొదటి స్థానంలోనే ఉంటుంది. లీగ్‌ మ్యాచ్‌ల అనంతరం మొదటి రెండు స్థానాల జట్ల మధ్య క్లాలిఫైయర్‌ మ్యాచ్‌ జరగుతుంది. మూడు, నాలుగు స్థానాల జట్ల మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగుతుంది. దీంతో ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ భారీ తేడాతో గెలవాలని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

Also Read: https://teluguprabha.net/telangana/telangana-bjp-meeting-is-going-to-be-held-today/

ట్రాఫిక్‌ ఆంక్షలు

ఈ ఉత్కంఠ పోరు సందర్భంగా ఈ రోజు హైదరాబాద్‌ మెట్రో రైలు సేవల సమయాన్ని అధికారులు పొడిగించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు మెట్రో సర్వీసులను వినియోగించకునే అవకాశం ఉంది. మరోవైపు నగరంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 12 గం. నుంచి రాత్రి 12 గం. వరకు నాగోల్‌- ఉప్పల్‌- హబ్సీగూడ, బోడుప్పల్‌- ఉప్పల్‌- అంబర్‌పేట్‌ మార్గాల్లో భారీ ట్రాఫిక్‌ ఉండనుంది. ఈ రూట్లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌ ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ప్రజలు వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలు, మెట్రో సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News