Homeతెలంగాణహైదరాబాద్MIM: చార్మినార్‌ వద్ద ఉద్రిక్తత.. ఎంఐఎం కార్పొరేటర్‌ కుమారుడు అరెస్ట్

MIM: చార్మినార్‌ వద్ద ఉద్రిక్తత.. ఎంఐఎం కార్పొరేటర్‌ కుమారుడు అరెస్ట్

MIM Corporator Son Arrested: హైదరాబాద్‌లో MIM కార్పొరేటర్‌ మహ్మద్‌ గౌస్‌ కుమారుడు మహ్మద్‌ సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్‌ దగ్గర ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్‌ అధికారులు, పోలీసులు వెళ్లగా.. వారిని అడ్డగించిన సాహిల్‌ అనంతరం వారితో గొడవకి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/harish-rao-alleges-rs-7-thousand-crore-land-scam-in-hyderabad-suburbs/

హైదరాబాద్‌లోని చార్మినార్‌ సమీపంలో ఆదివారం సాయంత్రం ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఎంఐఎం పార్టీకి చెందిన సీనియర్ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ కుమారుడు మహ్మద్ సాహిల్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంతో స్థానికంగా గందరగోళం నెలకొంది. చార్మినార్‌ పాదచారుల జోన్‌లో ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా.. ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు సాహిల్ ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులను అధికారులను సాహిల్‌ తోసివేశారు. అనంతరం వారితో వాగ్వాదానికి దిగారు. వారి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తోసేస్తూ తీవ్రంగా ప్రవర్తించడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-announces-100-days-action-plan-for-water-conservation/

ప్రభుత్వ అధికారులను బెదిరించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై పోలీసులు సాహిల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News