Wednesday, February 11, 2026
Homeతెలంగాణహైదరాబాద్KLH University: విద్యార్థులు తమ బాధ్యతలు మరిచిపోవద్దు- మంత్రి వివేక్‌

KLH University: విద్యార్థులు తమ బాధ్యతలు మరిచిపోవద్దు- మంత్రి వివేక్‌

KLH University Minister Vivek: విద్యార్థులు తమ బాధ్యతలు ఎప్పటికీ మరిచిపోవద్దని మంత్రి వివేక్‌ వెంకటస్వామి సూచించారు. కేఎల్‌హెచ్‌ యూనివర్సిటీ బాచ్‌పల్లి క్యాంపస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/nidhi-agarwal-drug-habit-do-you-know-why-she-had-to-quit/

విద్యార్థులు తమ లక్ష్యసాధన చేరుకునేవరకు బాధ్యత మరిచిపోవద్దని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి స్పష్టం చేశారు. మేడ్చల్‌ జిల్లా బాచ్‌పల్లిలోని కేఎల్‌హెచ్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. క్రమశిక్షణ, బాధ్యత, ప్రణాళిక వంటి అంశాలపై సోదాహరణగా వివరించారు. కళాశాలల, యూనివర్సిటీల్లో నేర్చుకునే విద్య అత్యంత విలువైనదని.. విద్యార్థులను అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్తుందని చెప్పారు. తల్లిదండ్రుల ఆశయాలను నిర్లక్ష్యం చేయొద్దని.. తమ పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడి చేసిన త్యాగాలను గుర్తించాలని సూచించారు. కుటుంబ మర్యాదను, తల్లిదండ్రుల ఆశయాలను నిలబెట్టాలని బాధ్యత వారిదే అని పేర్కొన్నారు. 

minister vivek klh

‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభ్యున్నతికి కట్టుబడి ఉంది. ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి అమలుచేస్తోంది. విదేశాలకు వెళ్లి విద్యార్థులు పడుతున్న కష్టాలను గుర్తించి మన రాష్ట్రంలోనే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పటిష్ఠమైన ప్రణాళికలు అమలు చేస్తోంది. మెరిట్‌ విద్యార్థుల కోసం కేఎల్‌హెచ్‌ యూనివర్సిటీ అమలు చేస్తున్న స్కాలర్‌షిప్‌ విధానం ప్రశంసనీయం.‘- మంత్రి వివేక్‌ వెంకటస్వామి

కేఎల్‌ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో జాతీయ స్థాయిలో ర్యాంకులు పొందిన విద్యార్థులకు మెమెంటోలను, మెడల్స్‌ను అందించారు. మెరిట్‌ విద్యార్థులకు ఏటా అందిస్తున్న రూ. 100 కోట్ల స్కాలర్‌షిప్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 

Also Read: https://teluguprabha.net/lifestyle/health-benefits-of-pomegranate-peels-and-how-to-use-them/

మెరిట్‌ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కేఎల్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ డా. జె. శ్రీనివాసరావు అన్నారు. విద్యా రంగంలోనే కాకుండా అనేక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే విద్యార్థులకు 100 శాతం స్కాలర్‌షిప్‌ అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీ ఎం. రవికుమార్‌, కేఎల్‌హెచ్‌ బాచ్‌పల్లి క్యాంపస్‌ రవికుమార్‌, గ్లోబల్‌ బిజినెస్‌ స్కూల్‌ డీన్‌ డా. ఆనంద్‌, యూనివర్సిటీ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ రాజేష్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News