సికింద్రాబాద్ (తెలుగుప్రభ): ఆధ్యాత్మిక విశ్వాసాలను ప రిరక్షిస్తూనే పర్యావరణ సంరక్ష ణకు ప్రాధాన్యం కల్పించే లక్ష్యం తో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ ఉద్వాసన – డివైన్ డ్రైవ్’ కార్య క్రమానికి విశేష స్పందన లభి స్తోంది. ఎంఎంసీ పరిధిలోని ఉప్పల్, మల్కాజ్‌గిరి, ఎల్‌బీ నగర్ జోన్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఒకే రోజు 100 కిలోలకు పైగా దివ్య వ్యర్థాలు సేక రించినట్లు అధికారులు తెలిపారు.ఎం ఎంసీ కమిషనర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి గత శనివారం ఉప్పల్‌లోని శ్రీ వెంకటే శ్వరస్వామి ఆల యంలో ప్రత్యేక పూజ లు నిర్వ హించి ఈ కార్యక్రమాన్ని లాంఛ నంగా ప్రారంభించారు. ప్రజల ఇళ్లలో వినియోగంలో లేకుండా ఉన్న పాత దేవతామూర్తులు, దేవతల చిత్రపటాలు, ఫ్రేములు, ఇతర పవిత్ర వస్తువులను గౌరవ ప్రదంగా సేకరించి సంప్రదాయ బద్ధంగా ఉద్వాసన పలికే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
మూడు జోన్లలో ప్రత్యేక కేంద్రాలు : ప్రాజెక్ట్ అమలులో భాగంగా ఎం ఎంసీ పరిధిలోని మూడు జోన్ల లో ఒక్కో ఆల యాన్ని ప్రత్యేక సేకరణ కేంద్రంగా ఎంపిక చేశారు. ఉప్పల్ జోన్‌లో ఉప్పల్ శ్రీ వెంక టేశ్వరస్వామి ఆలయం,మల్కా జ్‌గిరి జోన్‌లో మౌలాలి సర్కిల్ పరిధిలోని నేరేడ్మేట్ ముడుగుళ్లు ఆలయం,ఎల్‌బీ నగర్ జోన్‌లో సరూర్‌నగర్ సర్కిల్ పరిధిలోని కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆల యాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వ హించా రు. మూడు జోన్లలో జరిగిన కార్యక్రమా లను ఎంఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసా ద్ పర్యవేక్షించారు.
100 కిలోలకు పైగా దివ్య వ్యర్థాల సేకరణ : ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్య లో స్పందించి పాత దేవతా మూర్తులు, చిత్ర పటాలు, ఫ్రేము లు,పూజా సామగ్రి వంటి పవిత్ర వస్తువులను సేకరణ కేంద్రాలకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో మూడు జోన్లలో కలిపి 100 కిలోలకు పైగా దివ్య వ్యర్థాలు సేకరించినట్లు అదనపు కమిష నర్ రఘు ప్రసాద్ తెలిపారు.
సంప్రదాయబద్ధంగా ఉద్వాసన.. తర్వాత రీసైక్లింగ్ : సేకరించిన పవిత్ర వస్తువులను చెరువు లు,నాలాలు,రహదారులు లేదా ఇతర బహిరంగ ప్రదేశాల్లో పారవేయకుండా వాటి పవిత్రతకు భంగం కలగకుండా సంప్ర దాయబద్ధంగా ఉద్వాసన నిర్వ హిస్తున్నారు. అనంతరం వాటిని పర్యా వరణానికి హాని కలగని విధంగా శాస్త్రీ య, పర్యావరణ హిత రీసైక్లింగ్ ప్రక్రియ కు తర లించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
భక్తి–పర్యావరణ పరిరక్షణకు వారధి : ఈ సందర్భంగా అదనపు కమిషనర్ రఘు ప్రసాద్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక విశ్వాసాలకు గౌరవం ఇస్తూనే పవిత్ర వస్తువులను శా స్త్రీయంగా, పర్యావర ణహితంగా నిర్వహించడమే ‘ప్రాజెక్ట్ ఉద్వాసన’ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. భక్తి,సంప్రదాయం, పరిశుభ్రత,పర్యావ రణ బాధ్య తలను ఒకే వేదికపైకి తీసు కొచ్చే వినూత్న కార్యక్రమంగా దీనిని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొ న్నారు.
ప్రజలు సహకరించాలి : పాత దేవతామూర్తులు, చిత్రపటాలు, ఇతర పవిత్ర వస్తువు లను ఎక్కడపడితే అక్కడ పార వేయకుండా ఎంఎంసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాలకు మాత్ర మే అప్పగించాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం ద్వారా నగర పరిశుభ్రత, చెరు వులు–నాలాల పరిరక్షణ, పర్యా వరణ సంరక్షణతో పాటు ఆధ్యా త్మిక సంప్రదాయాల పరిరక్షణ కూడా సాధ్య మవుతుందని పేర్కొన్నారు.ప్రజల భాగస్వామ్యం తో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా కొనసాగించ నున్నట్లు ఆయన తెలిపారు.

