Homeతెలంగాణహైదరాబాద్NIMS: నిమ్స్‌లో మాక్‌ ఫైర్‌ డ్రిల్‌.. అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణే ధ్వేయం!

NIMS: నిమ్స్‌లో మాక్‌ ఫైర్‌ డ్రిల్‌.. అత్యవసర సమయాల్లో ప్రాణరక్షణే ధ్వేయం!

Mock fire drill: ప్రపంచ అత్యవసర వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని.. నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) ఆసుపత్రిలో మాక్‌ ఫైర్‌ డ్రిల్‌ను నిర్వహించారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ డ్రిల్‌ విజయవంతంగా జరిగింది. ట్రామా బ్లాక్‌లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం సాగింది.

- Advertisement -

డమ్మీ పేషెంట్లతో మాక్‌ డ్రిల్‌: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ఈ డ్రిల్ నిర్వహించినట్లు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. ప్రమాద తీవ్రతను వివరించేందుకు డమ్మీ పేషెంట్ల సహాయంతో సిబ్బందికి లైవ్ డెమో ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆకస్మికంగా అగ్నిప్రమాదం సంభవించినప్పుడు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, నర్సులు, సాంకేతిక, భద్రతా సిబ్బంది ఎలా స్పందించాలి? రోగులను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి? అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు.

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ: ఈ అగ్నిమాపక విన్యాసాలలో ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం హెచ్.ఓ.డి డాక్టర్ సునీల్, ట్రామా బ్లాక్‌లోని వివిధ విభాగాల సిబ్బంది, నర్సింగ్ అధికారులు, టెక్నీషియన్లు, శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రమాద సమయంలో అనుసరించాల్సిన రక్షణ చర్యలను, అగ్నిమాపక యంత్రాలను ఉపయోగించే విధానాన్ని ఈ సందర్భంగా అధికారులు సిబ్బందికి వివరించారు. హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు జిల్లా ఫైర్ ఆఫీసర్ టి. వెంకట్, అసిస్టెంట్ జిల్లా ఫైర్ ఆఫీసర్ వి. భానుప్రసాద్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు ఎం.డి. షౌకత్, పి. సాయి రెడ్డిల ప్రత్యక్ష మార్గదర్శకత్వంలో ఈ డ్రిల్ కొనసాగింది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News