Homeతెలంగాణహైదరాబాద్Railway GM: వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి.. రైల్వే జీఎం

Railway GM: వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి.. రైల్వే జీఎం

సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): వర్షాకాలంలో క్షేత్రస్థాయి సిబ్బంది మాన్సూన్ పెట్రోలింగ్‌ను అత్యంత అప్రమత్తంగా నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ అధికారులకు ఆదేశించారు. సోమవారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదలకు గురయ్యే సున్నితమైన రైల్వే ట్రాక్‌ల వద్ద నీటి ప్రవాహ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం కొనసాగించాలని సూచించారు. మానవ నిర్వహిత లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తతను నిరంతరం పరిశీలించేందుకు అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ అన్ని భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అదేవిధంగా ఏసీ కోచ్‌లలో లినెన్ నిర్వహణను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, అగ్నిప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా కోచ్‌ల మధ్యనున్న వెస్టిబ్యూల్ మార్గాలను ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంచాలని తెలిపారు. రైల్వే పట్టాలపై లోహ వస్తువులు ఉంచడం, నిర్మాణ వ్యర్థాలను పడేయడం వంటి ఆకతాయి చర్యలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

- Advertisement -

Also read: Tarnaka BJP: తార్నాక బీజేపీలో ముదిరిన వర్గ పోరు.. రోడ్డుకెక్కిన అంతర్గత విభేదాలు..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News