Homeతెలంగాణహైదరాబాద్Gandipet: గండిపేట జర్నలిస్టులకు కొత్త సారథ్యం.. మండల అధ్యక్షుడిగా రాము యాదవ్

Gandipet: గండిపేట జర్నలిస్టులకు కొత్త సారథ్యం.. మండల అధ్యక్షుడిగా రాము యాదవ్

గండిపేట్ (తెలుగు ప్రభ): గండిపేట మండల టీయూడబ్ల్యూజే–ఐజేయూ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండల పరిధిలోని మంచిరేవుల కమ్యూనిటీ హాల్‌లో సోమవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అధ్యక్షుడిగా జి. రాము యాదవ్ (వార్త పత్రిక)ను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగగా, నూతన కమిటీ బాధ్యతలు చేపట్టింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం హక్కుల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుతో పాటు కుటుంబాలకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసుకువస్తూ సమాజానికి అద్దం పట్టే బాధ్యతను ప్రతి జర్నలిస్టు సమర్థంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు సలీం పాషా మాట్లాడుతూ.. పత్రికలు ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభమని, నిజాయితీతో కూడిన వార్తలే ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విలువలు, వాస్తవాలకు కట్టుబడి వార్తా కథనాలను అందించడం జర్నలిస్టుల ప్రధాన బాధ్యతని పేర్కొన్నారు. నూతన అధ్యక్షుడు జి. రాము యాదవ్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర, జిల్లా కమిటీల మార్గదర్శకాలను అనుసరిస్తూ మండలంలోని ప్రతి జర్నలిస్టును కలుపుకొని సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సభ్యుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు భీమయ్య, జాయింట్ సెక్రటరీ సూర్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శి రాజేందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు రాజు, విష్ణు, సత్యకుమార్‌తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

- Advertisement -

Also Read: Arrest : అర్ధరాత్రి అరెస్టుతో ఆలూరులో అగ్గి.. పరామర్శకు వెళ్తే పాశవిక బంధనాలా?

గండిపేట్ మండలం నూతన కమిటీ..

గండిపేట మండల టీయూడబ్ల్యూజే–ఐజేయూ అధ్యక్షుడిగా జి. రాము యాదవ్ (వార్త) ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా గోపాల్ (సూర్య), టి. సత్యం గౌడ్ (సాక్షి), బి. ప్రవీణ్ యాదవ్ (దిశ), ప్రధాన కార్యదర్శిగా ఎస్. నరేందర్ (తెలుగు ప్రభ), కోశాధికారిగా పి. నర్సింహులు, సంయుక్త కార్యదర్శులుగా ఎ. శివకుమార్ (ప్రజాసాక్షి), ఎస్. ప్రభాకర్ (మన తెలంగాణ), జి. నరేష్ కుమార్ (నవ తెలంగాణ), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా జి. విజయ్ కుమార్ (ఆంధ్రప్రభ) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఎన్. రామకృష్ణ (క్యూ న్యూస్), విజయ్ ప్రతాప్, దాసరి రవికుమార్, లక్ష్మీనారాయణ, శ్యామ్ కుమార్, సుగ్రీవ్ ఎంపిక కాగా, రాజేందర్ రెడ్డి, రాజు, విష్ణు, సత్యకుమార్ గౌరవ సలహాదారులుగా కొనసాగనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News