Homeతెలంగాణహైదరాబాద్Suicide: కూకట్‌పల్లిలో విషాదం.. నవ దంపతుల ఆత్మహత్య!

Suicide: కూకట్‌పల్లిలో విషాదం.. నవ దంపతుల ఆత్మహత్య!

Newly couple suicide: కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం నెలకొంది. వైవాహిక జీవితాన్ని సంతోషంగా ప్రారంభించాల్సిన నవ దంపతులు అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

- Advertisement -

అర్ధాంతరంగా ముగిసిన దాంపత్యం: కార్తీక్, మంజుల అనే నవ దంపతులు కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. సంతోషంగా ప్రారంభం కావాల్సిన వీరి దాంపత్య జీవితం అర్ధాంతరంగా ముగిసింది. కారణం ఏంటో కానీ.. వీరిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. భర్త కార్తీక్ గదిలో ఉరివేసుకోగా.. భార్య మంజుల విషం తాగి ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Also read-Suicide: లవర్‌ ఫోన్ రీఛార్జ్ చేయలేదని.. యువతి ఆత్మహత్య!

అన్ని కోణాల్లో దర్యాప్తు: వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. కుటుంబ కలహాలా? లేక మరేదైనా ఆర్థిక ఇబ్బందులా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. నవ దంపతులు ఇలా విగతజీవులుగా పడి ఉండటం చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News