Homeతెలంగాణహైదరాబాద్Sri Nallapochamma: హరిబౌలి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

Sri Nallapochamma: హరిబౌలి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణ

  • సమర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొప్పుల ప్రవీణ్‌ కుమార్

చార్మినార్ (తెలుగు ప్రభ): ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలలో భాగంగా హరిబౌలి శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కొప్పుల ప్రవీణ్ కుమార్‌లు పట్టువస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించారు. అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. “నల్లపోచమ్మ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ మంచి జరగాలని, రైతులు, యువత, మహిళలు, పేదలు సంతోషంగా ఉండేలా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

- Advertisement -

Also Read: TKR: టీకేఆర్ కాలేజ్‌లో జాతీయ స్థాయి ‘క్వాంటమ్ అరేనా హ్యాకథాన్-2026’ ప్రారంభం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News