ఉస్మానియాయూనివర్సిటీ (తెలుగుప్రభ): ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆధ్వర్యంలో పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తో కలిసి ” డైరెక్ట్ కాంటాక్ట్ ప్రోగ్రాం” ను ఆర్ట్స్ కళాశాల లో బుధవారం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి.కాశీం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి మాట్లాడుతూ భార తదేశానికి సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని ప్రజలను కాపాడుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, రక్షణ రంగంలో వస్తున్న టెక్నాలజీ వ్యూహాలు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు విద్యార్థులతో సమావేశం అవ డం హర్షనీయమన్నారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలు కలి గి అవి సాధించే దిశగా ముందుకు సాగాలని కోరారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి. కాశీం మాట్లాడుతూ భారత వాయుసేనలో చేరడానికి విద్యార్థులకు ఇదొక మంచి అవకాశం అని పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం గొప్ప వారసత్వాన్ని, దేశ నిర్మాణంలో దాని పాత్రను ఆయన వివరించారు. రక్షణ దళాల అధికారులతో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచడంతో పాటు భారత వైమానిక దళంపై అవగాహన కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమానికి హాజ రైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ సీమాబ్ అకుతర్ మాట్లాడుతూ సరిహద్దు భద్రతా దేశ రక్షణతో పాటు ప్రకృతి విపత్తులు సంభవించిన ప్పుడు భారత వాయుసేన చేస్తున్న కృషిని గురించి వివరించారు. అలాగే వీడియో ప్రజెంటేషన్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి తెలియజేయడంతో పాటు ఇందులో ఉపాధి అవ కాశాలపై వివరించారు. భారత వైమానిక దళంలో ఉద్యోగ అవకాశాలు – ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ బ్రాంచ్, అగ్నివీర్ వాయు పథకం.
అర్హతలు, ఎంపిక విధానం & శిక్షణ ప్రక్రియల గురించి చెప్పారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే భారత వైమానిక దళంలో చేరడానికి ఆకాశమే హద్దు కాదు” అనే సందేశాన్ని ఆయన విద్యార్థులకు అందించారు.పరస్పర చర్చ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన వివిధ ప్రశ్నలకు ఎయిర్ ఫోర్స్ అధికారులు సమాధానాలు ఇచ్చారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన అంశాలపై క్విజ్ పోటీని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు విద్యార్థులకు నిర్వహించారు. విజేతలకు బహుమతులను కూడా వారు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్కా డ్రన్ లీడర్ రాకేష్, జూనియర్ వారంటీ ఆఫీసర్ డి భాదరి తదితరులు పాల్గొన్నారు.
ఈ పరస్పర చర్చా సమావేశం : అనంతరం ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏర్పాటుచేసిన ఇండక్షన్ పబ్లిసిటీ ఎగ్జిబిషన్ వెహికల్ సంబంధించిన సిమ్యులేషన్ కార్యక్రమం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ ముందు ఏర్పాటు చేసిన భారత వైమానిక దళ ప్రదర్శన వాహనంలో విద్యార్థులు పాల్గొని ప్రత్యక్ష అనుభవాన్ని పొందారు. రాడార్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ పరికరాలు, విమాన వ్యవస్థల గురించి అధికారులు వివరించారు. అలాగే ఈ బస్సులో ఏర్పాటు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సీటులో ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సి కాశీం కూడా కూర్చుని ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపిన అనుభూతిని పొందారు. అలాగే ఈ వాహనంలోకి ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి స్వాతి, పొలిటికల్ సైన్స్ హెడ్ ప్రొఫెసర్ శ్రీలత తదితరులు వాహనంలోకి ప్రవేశించి నూతన అనుభూతిని పొందారు.

