Homeతెలంగాణహైదరాబాద్OU: వట్టే జానయ్య యాదవ్‌పై చర్యలు నిలిపివేయాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్‌

OU: వట్టే జానయ్య యాదవ్‌పై చర్యలు నిలిపివేయాలని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు డిమాండ్‌

ఉస్మానియా యూనివర్సిటీ(తెలుగుప్రభ): బీసీ ఉద్యమకారుడు వట్టే జానయ్య యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. అక్రమ అరెస్టులు, నిర్బంధాలను వెంటనే నిలిపివేయాలని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

- Advertisement -

శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడాల రవికుమార్ మాట్లాడారు. గత 20 రోజులుగా జానయ్య కుటుంబ సభ్యులను చట్ట విరుద్ధంగా నిర్బంధించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బీసీల రాజ్యాధికార సాధన కోసం పోరాడుతున్న జానయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. జానయ్యపై జరుగుతున్న చర్యలను బీసీ ఉద్యమంపై జరుగుతున్న దాడులుగానే బీసీ సమాజం పరిగణిస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వం ఈ విధానాన్ని వెంటనే విరమించకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఆందోళన కార్యక్రమాలు చేపడతారని రవికుమార్‌ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మామిడాల రవికుమార్‌తో పాటు వడ్నాల మల్లేష్, బోయపల్లి లింగస్వామి, వీరయ్య, పేరూరి సతీష్, కిరణ్, ప్రసాద్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News