Homeతెలంగాణహైదరాబాద్Badangpet: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

Badangpet: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి

బడంగ్‌పేట్(తెలుగు ప్రభ): ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు, పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని ప్రభుత్వ పాఠశాలల సాధన కమిటీ డిమాండ్ చేసింది. బడంగ్‌పేట్ ప్రజా భవన్‌లో కమిటీ ఆధ్వర్యంలో బాలాపూర్ మండల కమిటీ సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్యా సదుపాయాలు కల్పించాలని కోరారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో వసూలు చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సమావేశంలో డిమాండ్ చేశారు. విద్య ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకట్ రెడ్డి, కన్నెగంటి రవి, వెంకట్ స్వామి, ప్రభుత్వ పాఠశాలల సాధన కమిటీ సభ్యులు ఇంద్రా, అమృత నాయుడు, మారబోయిన నరేందర్, గట్టు బాలకృష్ణ, కొల్లూరు భీమేష్, వంక ఉపేందర్, సూర్ణగంటి రంజిత్ కుమార్, రాజ్ మంగ, పద్మశ్రీ, హరీష్, సరిత, ముకుందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News