బడంగ్ పేట్ (తెలుగు ప్రభ): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జీహెచ్ఎంసీ ప్రాంతాలైన బాలాపూర్, బడంగ్పేట్, అల్మాస్గూడలో కొలువుదీరిన దుర్గామాత మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ప్రార్థించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మాజీ కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బోయపల్లి గోవర్ధన్ రెడ్డి, నిరుడు శ్రీరాములు, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, గట్టు బాలకృష్ణ, బోయపల్లి వెంకట్ రెడ్డి, దిండు శ్రీనివాస్ గౌడ్, బొల్లపల్లి కుమార్, టేకుల శశిధర్ రెడ్డి, ఎదుల్ల ప్రతాప్ రెడ్డి, రామిడి శ్రీనివాస్ రెడ్డి, తూళ్ళ నరహరి గౌడ్, అమృత నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Badangpet: బడంగ్పేట్లో దుర్గామాత మండపాలను సందర్శించిన పారిజాత నర్సింహారెడ్డి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

