బడంగ్ పేట్ ( తెలుగు ప్రభ ) : ప్రజా సేవనే పరమావధిగా భావించి, ప్రజల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దివంగత నేత, పట్లోళ్ల ఇంద్రారెడ్డి సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పట్లోళ్ల ఇంద్రారెడ్డి 72వ జయంతి సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో పాటు బడంగ్ పేట్ కు చెందిన బీఆర్ ఎస్ నేతలతో కలిసి చేవెళ్ల, కౌకుంట్లలోని ఆయన సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇంద్రారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. “కాలం మారినా ఆయన జ్ఞాపకాలు చెరిగిపోవు. ప్రజల కోసం ఆయన వేసిన అడుగులు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే” అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజల సంక్షేమం కోసం ఇంద్రారెడ్డి చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు గట్టు మహిపాల్, బాల్వంత్, పుట్ట గళ్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

