సికింద్రాబాద్ (తెలుగుప్రభ): శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి బంగారు బోనం, పట్టువస్త్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీక అని పేర్కొన్నా రు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షా లు కురిసి పాడిపంటలు పుష్క లంగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసం తోషాలతో జీవించాలని అమ్మ వారిని ప్రార్థించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని, ప్రతి ఒక్కరూ తమ తమ వృత్తుల్లో అభివృద్ధి సాధించాలని అమ్మవారి ఆశీర్వా దం కోరినట్లు చెప్పారు.బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిం దని మంత్రి తెలిపారు. హైదరా బాద్ ప్రజలు ఆతిథ్యానికి పేరుగాంచిన వారని, బోనాల పండుగను కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి జరుపుకోవడం తెలంగాణ ప్రత్యేకత అని అన్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఈసారి భక్తుల రద్దీ మరింత పెరిగిందని పేర్కొన్నారు. గతంలో ఎన్నో విపత్తుల నుంచి అమ్మవారు ప్రజలను కాపాడారని, ప్రస్తుతం కూడా ప్రకృతి వైపరీత్యాలు, ఎల్‌నినో ప్రభావం వంటి ఇబ్బందులు రాష్ట్రానికి దూరంగా ఉండాలని రాష్ట్రంలోని అన్ని అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.అమ్మవారి కరుణా కటాక్షాలతో తెలంగాణలో మంచి వర్షాలు కురిసి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

