Wednesday, February 11, 2026
Homeతెలంగాణహైదరాబాద్Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత!

Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేత!

Power cut: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం (జనవరి 21) విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఫీడర్ల మరమ్మతులు, విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు వంటి నిర్వహణ పనుల కారణంగా ఆయా సమయాల్లో పవర్ కట్ ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు.

- Advertisement -

బంజారాహిల్స్ & గ్రీన్‌ల్యాండ్స్: బంజారాహిల్స్‌ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ సీఆర్‌పీఎఫ్‌, మారుతి నగర్‌ ఫీడర్ల పరిధిఖలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేయనున్నట్లుగా తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.12, అక్బర్‌ ఫాం ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

చిక్కడపల్లి, రామంతాపూర్‌ పరిధిలో: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆజామాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా, పటేల్‌నగర్‌, బతుకమ్మకుంట, అంబర్‌పేట్‌, బషీర్‌బాగ్‌, జాఫర్‌ అలీబాగ్‌ ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేస్తారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆజామాబాద్‌ ఇండస్ట్రియల్‌, విద్యానగర్‌ లేన్‌, నిజామ్‌కాలేజ్‌, కపాడియా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఉండదని పేర్కొన్నారు. అలాగే రామంతాపూర్‌ పాలిటెక్నిక్‌ ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలోని ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్‌ సరఫరా ఉండదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Also read-Hyderabad: పోలీస్ కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ.. ఇంకా వీడని సందిగ్ధత!

నార్సింగ్‌, గాజులరామారం పరిధిలో: హిమాయత్‌సాగర్‌ ఫీడ ర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరా ఉండదని ఏఈ ఎ.రమేశ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్నేహితహిల్స్‌, సాదాన్‌ కాలేజీ పరిసరాల్లో ఉదయం పూట.. అక్బర్ కాలనీ, సబితా ఇంద్రారెడ్డి కాలనీల్లో మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు సరఫరా నిలిపివేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే విద్యుత్‌ సంబంధ మరమ్మతుల కారణంగా గాజులరామారం సబ్‌స్టేషన్‌ పరిధిలోని కైలా్‌సహిల్స్‌, శంషీగూడ ఫీడర్ల పరిధిలో బుధవారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ చైతన్య భార్గవ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షిరిడీ హిల్స్‌, నందిని హిల్స్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ ఉండదని తెలిపారు. విద్యుత్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే ఫోన్‌ నెంబరు 8712472564కు ఫిర్యాదు చేయాలని ఏఈ కోరారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News