Homeతెలంగాణహైదరాబాద్Welfare : ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా ఐక్యంగా ముందుండాలి: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

Welfare : ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా ఐక్యంగా ముందుండాలి: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

గండిపేట్ (తెలుగు ప్రభ): ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కీలక వారధిగా వ్యవహరిస్తారని, ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా ఐక్యంగా, బాధ్యతాయుతంగా పనిచేయాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం టియూడబ్ల్యూజే గండిపేట మండల నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు

- Advertisement -

ఈ సందర్భంగా వారిని అభినందించిన ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ… వేగంగా అభివృద్ధి చెందుతున్న గండిపేట మండలంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ట్రాఫిక్, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి మౌలిక సమస్యలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. వాటి పరిష్కారానికి అధికారులు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పట్టణాభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఇప్పటికే సూచనలు చేశామని, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఎమ్మెల్యే వెల్లడించారు.

జర్నలిస్టుల సంక్షేమమే తనకు ముఖ్యమని పేర్కొన్న ప్రకాశ్ గౌడ్, ప్రభుత్వం అందించే ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు తదితర సంక్షేమ పథకాల అమలుకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే గండిపేట మండల నూతన అధ్యక్షుడు జి. రాము యాదవ్ ను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఎ. రాజేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు టి. సత్యం గౌడ్, గోపాల్, బి. ప్రవీణ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఎస్. నరేందర్, కోశాధికారి పి. నర్సింహులు, సంయుక్త కార్యదర్శులు ఎస్. ప్రభాకర్, ఎ. శివకుమార్, కార్యనిర్వాహక కార్యదర్శులు జి. విజయ్‌కుమార్, ఎన్. రామకృష్ణతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News