Homeతెలంగాణహైదరాబాద్Chettipalli Srinivas: జర్నలిస్ట్ చెట్టిపల్లి శ్రీనివాస్‌కు ‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ రత్న’ అవార్డు

Chettipalli Srinivas: జర్నలిస్ట్ చెట్టిపల్లి శ్రీనివాస్‌కు ‘ప్రైడ్ ఆఫ్ తెలంగాణ రత్న’ అవార్డు

సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): జర్నలిస్టుగా, తెలంగాణ ఉద్యమకారుడిగా సమాజానికి విశేష సేవలందించిన జర్నలిస్ట్ చెట్టిపల్లి శ్రీనివాస్ ప్రతిష్టాత్మక ప్రైడ్ ఆఫ్ తెలంగాణ రత్న ఎక్సలెన్సీ అవార్డు -2026కు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృ తిక శాఖ సౌజన్యంతో, వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని రవీంద్ర భారతిలో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రగతి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వల్లూరి శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకకు మాజీ మంత్రి పుష్పలీల, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞశర్మ ముఖ్య అతిథులుగా హాజరై శ్రీనివాస్‌కు పురస్కారాన్ని అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మారుమూల గ్రామమైన వస్తా కొండూరులోని ఓ దళిత రైతుకూలీ కుటుంబంలో జన్మించిన చెట్టిపల్లి శ్రీనివాస్, పైచదువులు, ఉపాధి కోసం హైదరాబాద్‌ వచ్చి సికింద్రాబాద్‌లో స్థిరపడ్డారు. జర్నలిజంలో రాణిస్తూనే, తెలంగాణ ఉద్యమంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ పురస్కారానికి ఎంపిక చేసింది.

- Advertisement -

Also Read: Meerpet: మీర్ పేట్‌లో ప్రతీకార హత్య.. బావను చంపిన బావమరిది

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News