Homeతెలంగాణహైదరాబాద్Ragging : ఫెస్ట్ పేరిట ఫ్యాక్షన్ వేధింపులు.. ఫిజిక్స్ వాలా కాలేజీలో సీనియర్ల పిడిగుద్దులు

Ragging : ఫెస్ట్ పేరిట ఫ్యాక్షన్ వేధింపులు.. ఫిజిక్స్ వాలా కాలేజీలో సీనియర్ల పిడిగుద్దులు

ఎల్బీనగర్ (తెలుగుప్రభ) : ‘ఫెస్ట్‌’కు సంబంధించిన చర్చ నేపథ్యంలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటనపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు.  చైతన్యపురి ఎస్​హెచ్​వో సైదులు వివరాల ప్రకారం… సరూర్‌నగర్‌కు చెందిన అఖిల్​తేజ (17) కొత్తపేటలోని ‘ఫిజిక్స్ వాలా జూనియర్ కాలేజీ’ లో ఇంటర్ ఫస్ట్​ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీలో నిర్వహించిన ‘ఫెస్ట్’ చర్చ సందర్భంగా సీనియర్లు జూనియర్లను వేధించారు. 

- Advertisement -

అనంతరం కాలేజీ సమీపంలో ముగ్గురు సీనియర్ విద్యార్థులు అఖిల్​తేజపై పిడిగుద్దులు గుద్దారు. ఈ ఘటనలో విద్యార్థికి ముక్కు ఎముక విరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందగా, శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అఖిల్​తేజ చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా కారణమని ఫిర్యాదులో ఆరోపించారు. దీంతో సీనియర్ విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు.  కాలేజీలలో ర్యాగింగ్, విద్యార్థులపై హింస, వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ ఈ సందర్భంగా హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News