Homeతెలంగాణహైదరాబాద్Moinabad: మాట తప్పని రాజు.. ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా రెడ్డిపల్లి సర్పంచ్

Moinabad: మాట తప్పని రాజు.. ఇతర ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా రెడ్డిపల్లి సర్పంచ్

మొయినాబాద్ (తెలుగు ప్రభ): గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని క్రమం తప్పకుండా అమలు చేస్తానని రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ షాపురం మాణిక్యం(రాజు) స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో పాప లేదా బాబు జన్మిస్తే ‘అమ్మ పుణ్యవతి తల్లి దీవెన’ పథకం కింద రూ. 11,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం గ్రామానికి చెందిన గడ్డం ఉదయ్ – అశ్విని దంపతులకు బాబు జన్మించడంతో వారికి రూ. 11,000 చెక్కును సర్పంచ్ స్వయంగా అందజేశారు. ఇప్పటివరకు ఈ పథకం కింద ఇది 9వ చెక్కు కావడం విశేషం.

- Advertisement -

ఈ సందర్భంగా సర్పంచ్ మాణిక్యం(రాజు) మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం ద్వారా అండగా ఉంటామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రచారంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేరుస్తూ రెడ్డిపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధికి గ్రామస్థులందరి సహకారం ఎంతో అవసరమని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News