సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): చర్లపల్లి కేంద్ర కారాగారం లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ ఖైదీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందా డు. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో కర్ణాటకకు చెందిన రోహిత్ (20) రెండు నెలల క్రితం చర్లపల్లి జైలుకు రిమాండ్ ఖైదీగా వచ్చాడు. జైలు అధికారుల వివరాల ప్రకారం, మనస్తాపానికి గురైన రోహిత్ ఈ నెల 12న జైలులో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన జైలు సిబ్బంది వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషాదకరమైన విషయమేమంటే రోహిత్‌కు కోర్టు బెయిల్ మంజూరు అయిన రోజే అతను ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను కలిచివేసింది. గురువారం గాంధీ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అధికారులు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: HMDA Ground: కులవృత్తుల మేళా ప్రారంభం.. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో 60 స్టాళ్ళు ఏర్పాటు

