Homeతెలంగాణహైదరాబాద్Tarnaka: తార్నాక ఫ్లైఓవర్‌పై మరమ్మతులు పూర్తి.. ఓయూ ట్రాఫిక్ పోలీసుల చర్యలు

Tarnaka: తార్నాక ఫ్లైఓవర్‌పై మరమ్మతులు పూర్తి.. ఓయూ ట్రాఫిక్ పోలీసుల చర్యలు

సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): వర్షాకాలంలో వాహనదారుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ తార్నాక ఫ్లైఓవర్‌పై చేపట్టిన రోడ్డు ప్యాచ్‌వర్క్ పనులు పూర్తయ్యాయి. జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులు సమన్వయంతో మరమ్మతు పనులను చేపట్టి పూర్తి చేశారు. పనులు కొనసాగుతున్న సమయంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉస్మానియా యూనివర్సిటీ ట్రాఫిక్ పోలీ సులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసర మైన ప్రాంతాల్లో వాహనాలను మళ్లించా రు. దీంతో మరమ్మతు పనులు జరుగుతున్నప్పటికీ ట్రాఫిక్ సజావుగా కొనసాగింది. వర్షాల కారణంగా రహదా రులు దెబ్బతినడం, గుంతలు ఏర్పడటం వల్ల ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగానే ప్యాచ్‌వర్క్ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని, ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

- Advertisement -

Also Read: Bonalu : చిలకలగూడ బోనాల ఉత్సవాలకు పక్కా ప్రణాళిక.. అధికారులతో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సమీక్ష!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News