Murder in Jubilee Hills: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్యకు గురయ్యారు. ప్రశాసన్ నగర్‌లోని ప్లాట్ నంబర్ 46లో నివాసం ఉంటున్న రిటైర్డ్ అదనపు డైరెక్టర్ జనరల్ వినయ్ రంజన్ రాయ్ సతీమణి సునంద(55)ను ఆమె ఇంట్లోనే పనిచేసే వారే ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పెద్దమొత్తంలో సొత్తుతో ఉడాయించినట్లు తెలుస్తోంది.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/young-man-brutally-murdered-in-chilakalguda/
సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ డీసీపీ, సీపీ సజ్జనార్ సహా ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ హత్యకు పాల్పడింది నేపాలీ గ్యాంగ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా.. పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. క్లూస్ టీమ్, వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడికి చేరుకుని వినయ్ రంజన్‌ను పరామర్శించారు.

