Homeతెలంగాణహైదరాబాద్Meerpet: మీర్ పేట్‌లో ప్రతీకార హత్య.. బావను చంపిన బావమరిది

Meerpet: మీర్ పేట్‌లో ప్రతీకార హత్య.. బావను చంపిన బావమరిది

  • అక్క, అన్నలను చంపిన బావను హత్య చేసిన బావమరిది
  • మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

బడంగ్ పేట్ (తెలుగు ప్రభ): అక్క, అన్నలను దారుణంగా చంపిన బావ రౌడీ షీటర్‌ను బావ మరిది అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన సూరి (35 ) కరడు గట్టిన రౌడీ షీటర్. సల్మాన్ సోదరిని రౌడీ షీటర్ సూరి మొదట ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. 2022లో ప్రేమించి పెళ్ళి చేసుకున్న మొదటి భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు. తన సోదరిని హత్య చేసిన బావ సూరిని ఎలాగైనా హత్య చేయాలని బావమరిది సల్మాన్ పథకం పన్నాడు. ఈ నేపథ్యంలోనే 2024 లో పథకం వేశాడు. దీనిలో భాగంగా వెంట తెచ్చుకున్న కత్తితో దాడిచేయడానికి ప్రయత్నించగా తప్పించుకున్న సూరి తిరిగి అదే కత్తితో సల్మాన్‌ను అతి కిరాతకంగా హత్య చేశాడు. దీంతో అక్క, అన్నను హత్య చేసిన బావ సూరిని ఎలాగైనా హత్య చేసి ప్రతీకారం తీర్చుకోవాలని చిన్న బావ మరిది అఫ్రోజ్ (22) పథకం పన్నాడు. ఇది ఇలా ఉండగా సూరి మొదటి భార్యను హత్య చేసిన తరువాత ఓ మహిళను ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నాడు. నెల రోజుల క్రితం బెయిలుపై వచ్చిన రౌడీ షీటర్ సూరి పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్నాడు. కాగా, నందనవనం కాలనీలో ఉంటున్న రెండవ భార్య తన తమ్ముడి బర్త్ డే ఉందంటూ రావాలని భర్త సూరికి ఫోన్ చేసింది. దీంతో, సోమవారం సాయంత్రం నందనవనం కాలనీకి వచ్చిన రౌడీ షీటర్ బావ మరిది జన్మదిన వేడుకల్లో నిమగ్నమై ఉన్నాడు. సమాచారం అందుకున్న అఫ్రోజ్ మరో ఇద్దరితో కలిసి తన అక్క, తమ్ముడిని దారుణంగా హత్య చేసిన బావ సూరిని కత్తి దాడి చేశాడు. దీంతో, సూరి కత్తి గాయాలతో బయటికి పరుగులు తీయగా వెంటపడి వేటాడి మరి అఫ్రోజ్ కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన సూరిని చికిత్స నిమిత్తం డీఆర్డిఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సూరి మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు. ఈ కేసును మీర్ పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మీర్‌పేట్‌లో రౌడీ షీటర్ నందనవనం సూరి హత్య అనంతరం ప్రధాన నిందితుడిగా అఫ్రోజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌కు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ లైవ్‌లో సూరిని తానే హత్య చేసినట్లు అఫ్రోజ్ అంగీకరించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Also Read: Metro : హైదరాబాద్ మెట్రో హంగులపై రైల్వే జీఎం హర్షం.. సమన్వయం దిశగా కీలక అడుగులు!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News