Homeతెలంగాణహైదరాబాద్Yashoda Hospitals: యశోద హాస్పిటల్స్ ఆధ్యర్యంలో 'డెక్కన్‌ ఆర్థ్రోప్లాస్టీ సమ్మిట్‌'- 2026.. ఈ అంశాలపై అవగాహన.!

Yashoda Hospitals: యశోద హాస్పిటల్స్ ఆధ్యర్యంలో ‘డెక్కన్‌ ఆర్థ్రోప్లాస్టీ సమ్మిట్‌’- 2026.. ఈ అంశాలపై అవగాహన.!

Yashoda Hospitals Deccan Arthroplasty Summit 2026: యశోద హాస్పిటల్స్-సికింద్రాబాద్ ఆధ్వర్యంలో రోబోటిక్-అసిస్టెడ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ, కాంప్లెక్స్ ట్రామా మేనేజ్‌మెంట్, స్పోర్ట్స్ మెడిసిన్- ఆర్థ్రోప్లాస్టీ వైద్య రంగాల్లో జరుగుతున్న అధునాతన సాంకేతిక పురోగతులు, వినూత్న శస్త్రచికిత్స విధానాలు, రోగుల సంరక్షణలో ఉత్తమ వైద్య పద్ధతులపై అవగాహన కల్పించే ప్రతిష్టాత్మక శాస్త్రీయ సదస్సు “డెక్కన్ ఆర్థ్రోప్లాస్టీ సమ్మిట్ 2026” శనివారం హోటల్ మ్యారీ గోల్డ్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సును యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి* ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/crime-news/grandfather-died-while-attempting-to-rescue-grandson-fell-into-borewell-in-miryalaguda/

మే 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల జాతీయ స్థాయి సదస్సులో దేశవ్యాప్తంగా పేరొందిన 500 మందికి పైగా ఆర్థోపెడిక్ శస్త్రచికిత్స నిపుణులు, జాయింట్ రీప్లేస్‌మెంట్ స్పెషలిస్టులు పాల్గొననున్నారు. ఇంకా ఆర్థోపెడిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, ఆరోగ్య రంగ నిపుణులు కూడా ఈ సదస్సులో పాల్గొని ఆర్థ్రోప్లాస్టీ వైద్య రంగంలోని తాజా పరిణామాలపై చర్చించారు. 

yashoda hospitals deccan secbad

ఈ సందర్భంగా డాక్టర్. పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. డెక్కన్ ఆర్థ్రోప్లాస్టీ సమ్మిట్ 2026 ద్వారా ఆర్థోపెడిక్ విద్య, శస్త్రచికిత్స నైపుణ్యం, అకాడెమిక్ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని యశోద హాస్పిటల్స్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అనుభవజ్ఞులైన సర్జన్లు, యువ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు, వైద్య సిబ్బంది ఒకే వేదికపై కలిసి జాయింట్ రీప్లేస్‌మెంట్ రంగంలోని అత్యాధునిక పద్ధతులపై చర్చించేందుకు ఈ సమ్మిట్ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా లైవ్ సర్జరీలు, నిపుణుల చర్చలు, ఇంటరాక్టివ్ సెషన్ల ద్వారా ఆధునిక శస్త్రచికిత్స విధానాలు, ప్రెసిషన్ ఆధారిత చికిత్సలు, రోగుల ఫలితాలను మెరుగుపరిచే సాంకేతికతలపై యువ వైద్యులకు ఈ సదస్సు ఎంతో దోహదపడుతుందని వివరించారు. 

yashoda hospitals deccan

ఈ సదస్సు గురించి సికింద్రాబాద్-యశోద హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ & జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్ డాక్టర్ టి. జయకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. కేస్ ఆధారిత లెర్నింగ్, ప్రాక్టికల్ సర్జికల్ డెమోన్‌స్ట్రేషన్స్‌ ద్వారా వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యంగా తెలిపారు. మోకాలితో పాటు హిప్ జాయింట్ రీప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సల్లో తాజా పురోగతులు, రోగి భద్రత, రిహాబిలిటేషన్ విధానాలు, మెరుగైన శస్త్రచికిత్స ఫలితాలపై ప్రత్యేకంగా చర్చిచామని పేర్కొన్నారు. సదస్సులో భాగంగా నిర్వహించిన రోబోటిక్ హిప్ అండ్‌ మోకాలి జాయింట్ రీప్లేస్‌మెంట్ లైవ్ సర్జరీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయన్నారు.

Also Read: https://teluguprabha.net/sports-news/srh-vs-rcb-match-in-uppal-cyber-scams-under-the-guise-of-ipl-tickets/

ఆధునిక సర్జికల్ టెక్నిక్స్, అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించే రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ విధానాలపై పాల్గొన్న వైద్యులకు ప్రత్యక్ష అవగాహన కల్పించారని డా. టి. జయకృష్ణారెడ్డి తెలియజేశారు. అదేవిధంగా ఇంటరాక్టివ్ కేస్-బేస్డ్ డిస్కషన్స్, ఆర్థ్రోప్లాస్టీలో ప్రస్తుత ధోరణులపై నిపుణుల ప్రసంగాలు, అడ్వాన్స్‌డ్ జాయింట్ రీకన్‌స్ట్రక్షన్ టెక్నిక్స్‌పై శాస్త్రీయ సెషన్స్ నిర్వహించామని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News