Homeతెలంగాణహైదరాబాద్Hyderabad: భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. రూ. 64 లక్షల విలువైన మత్తు పదార్థాలు సీజ్!

Hyderabad: భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. రూ. 64 లక్షల విలువైన మత్తు పదార్థాలు సీజ్!

Huge drug seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. నగర కమిషనరేట్ పరిధిలో చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో లక్షలాది రూపాయల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

పోలీసుల మెరుపు దాడి: పక్కా సమాచారంతో చిలకలగూడ, ఆదిభట్ల పోలీసులు సమన్వయంతో జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించారు. దీంతో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. సుమారు రూ. 64.35 లక్షల విలువైన మత్తు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. మత్తు పదార్థాలతో పాటుగా ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భాగ్యనగరంలో డ్రగ్స్ రవాణా మరియు విక్రయాలపై పోలీసులు ఇప్పటికే నిఘా పెంచారు. పట్టుబడిన నిందితుల వెనుక ఉన్న నెట్‌వర్క్ గురించి పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News