RTC bus: హైదరాబాద్‌లోని ఉప్పల్ నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్‌స్టాండ్ ప్రాంతం చిన్నపాటి వర్షానికే అధ్వానంగా మారుతోంది. సరైన వసతులు లేకపోవడంతో ఆ ప్రాంతం పూర్తిగా బురదమయంగా తయారైంది.
బురదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు: తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటనలో.. తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అకస్మాత్తుగా బురదలో కూరుకుపోయింది. బస్సు టైర్లు పూర్తిగా మట్టిలో దిగిపోవడంతో అక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించారు. జేసీబీ (JCB) సాయంతో ఆ బస్సును సురక్షితంగా బయటకు తీశారు. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులతో పాటు ఆర్టీసీ సిబ్బంది పడుతున్న ఇబ్బందుల పట్ల స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read-Hyderabad: భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన.. ఆరెంజ్ అలర్ట్ జారీ!

