Homeతెలంగాణహైదరాబాద్Secunderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 105 మంది

Secunderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 105 మంది

  • అంబులెన్స్‌ డ్రైవర్లకూ తప్పని తనిఖీలు.. ట్రాఫిక్‌ పోలీసుల హెచ్చరిక

సికింద్రాబాద్‌ (తెలుగుప్రభ): మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై మల్కాజిగిరి ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అక్టోబరు 9, 10 తేదీల్లో చేపట్టిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో మొత్తం 105 కేసులు నమోదు చేశారు. వీటిలో అక్టోబరు 9న 62, అక్టోబరు 10న 43 కేసులు ఉన్నాయి. బేగంపేటలోని షాపర్స్‌ స్టాప్‌, సేఫ్‌ ఎక్స్‌ప్రెస్‌, బోయిన్‌ పల్లి, అంజయ్యనగర్‌, తిరుమ లగిరి, బుర్తన్‌గూడ, అల్వాల్‌ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

- Advertisement -

అంబులెన్స్‌ డ్రైవర్లూ పట్టుబ డ్డారు..

తనిఖీల్లో అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాల డ్రైవర్లు, అంబులెన్స్‌ డ్రైవర్లలో కొందరు మద్యం సేవించి వాహ నాలు నడుపుతూ పట్టుబడి నట్లు తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ డీసీపీ శంకర్ రాజు వెల్లడించారు. ఇలాంటి నిర్లక్ష్యం డ్రైవర్లతో పాటు రోగుల ప్రాణాలకు, ఇతర వాహన దారుల భద్రతకు ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.

మద్యం తాగి వాహనం నడపొద్దు..

మద్యం సేవించి వాహనాలు నడపడం తీవ్రమైన ట్రాఫిక్‌ నేరమని పోలీసులు స్పష్టం చేశారు. దీనివల్ల ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదముందని, బాధితుల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాల భద్రతకు ప్రాధాన్య మివ్వాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News