Rangam Prediction:భాగ్యనగరం అంతా బోనాల సందడి కనిపిస్తోంది.సికింద్రాబాద్ ఉజ్జయిన మహంకాళి అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు.లష్కర్ బోనాల ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అయినటువంటి సోమవారం రంగం భవిష్యవాణి మొదలైంది.
అత్యంత ముఖ్యమైన సాంప్రదాయ…
సికింద్రాబాద్ ఉజ్జయిన మహంకాళి ఆలయం బోనాల జాతరలో రెండో రోజు నిర్వహించే రంగం అత్యంత ముఖ్యమైన సాంప్రదాయ ఘట్టం. ఈ ఘట్టంలో మాతంగి స్వర్ణలత అమ్మవారిని ఆవాహన చేసుకుని వచ్చే ఏడాదికి సంబంధించిన భవిష్యవాణిని వినిపిస్తారు.
రాబోయే ఏడాదిలో రాష్ట్రంలో వర్షపాతం, పంటలు, ప్రజల ఆరోగ్య పరిస్థితులు, అలాగే అమ్మవారికి సమర్పించిన బోనాలు, పూజలపై ఆమె రంగంలో వినిపించనున్నారు. రంగం కార్యక్రమం దృష్ట్యా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also Read:Weather: ఏపీ,తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వానలే..వానలు

