Homeతెలంగాణహైదరాబాద్BJP Protest: ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’లో భాగంగా సంతకాల సేకరణ

BJP Protest: ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’లో భాగంగా సంతకాల సేకరణ

ఎల్బీనగర్ (తెలుగు ప్రభ): ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చేపట్టిన ‘ఫీజుల బకాయి–బీజేపీ లడాయి’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మన్సూరాబాద్, హయత్‌నగర్ పరిధిలోని పలు ప్రైవేట్ జూనియర్‌, డిగ్రీ, బీటెక్ కాలేజీల్లో విద్యార్థులు సంతకాల సేకరణ చేపట్టారు. బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అర్బన్ నాయకుడు పారంద సాయి, జయతేజ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్గం యశ్పాల్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకుండా సుమారు రూ.15 వేల కోట్ల మేర బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా నాయకుడు నక్క రాజేష్ గౌడ్, ప్రమోద్ రెడ్డి, బీజేవైఎం నాయకులు ఎర్ర ప్రేమ, పాండాల అభిలాష్ గౌడ్, విష్ణుచారి, బుల్లెట్ సాయి యాదవ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Also Read: Drunk drive: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌తో నలుగురికి జైలు.. 60 మందికి జరిమానా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News