Homeతెలంగాణహైదరాబాద్Smith Macher: భారత పైలట్ స్మిత్ త్వరగా కోలుకోవాలని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

Smith Macher: భారత పైలట్ స్మిత్ త్వరగా కోలుకోవాలని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు

చార్మినార్ , (తెలుగు ప్రభ) : భారత పైలట్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితం గడపాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్ చార్మినార్‌లోని శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర వాల్మీకి బోయ కార్పొరేషన్ వైస్ చైర్మన్ బోయ నగేష్ అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం తరపున స్మిత్ మచ్చర్ ఆరోగ్యం కోసం అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

- Advertisement -

ఇటీవల విమాన ప్రమాదాన్ని నివారించేందుకు స్మిత్ మచ్చర్ చేసిన ప్రయత్నాల నేపథ్యంలో ఆయనపై ప్రశంసలు కురిపించారు. స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకుడు ముజీబుల్లా షరీఫ్, తెలంగాణ రాష్ట్ర రజక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బంగారు బాబు, వెంకటేష్ ముదిరాజు, బి. మధుమోహన్, వాగ్గు పవన్, సందీప్, శ్రీకాంత్, గణేష్ రాథోడ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News