Homeతెలంగాణహైదరాబాద్Special Trains: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. చర్లపల్లి–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

Special Trains: ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. చర్లపల్లి–తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్ (తెలుగుప్రభ): రానున్న పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి– తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్‌ 10న చర్లపల్లి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు (07713) రాత్రి 6.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్‌ 11న తిరుపతి నుంచి రైలు (07714) మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

- Advertisement -

ఈ రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగు తాయి. ఈ ప్రత్యేక రైళ్లలో స్లీపర్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News