Homeతెలంగాణహైదరాబాద్Renova BB Cancer Hospital: రెనోవా బీబీ క్యాన్సర్ ఆస్పత్రిలో అత్యాధునిక బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్...

Renova BB Cancer Hospital: రెనోవా బీబీ క్యాన్సర్ ఆస్పత్రిలో అత్యాధునిక బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ సేవలు

సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): రక్త క్యాన్సర్లు, క్లిష్టమైన రక్త సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులు, పెద్దలకు అత్యాధునిక చికిత్సలు అందించేందుకు రెనోవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్స్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎమ్‌టీ), సెల్యులార్ థెరపీ సేవలను ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ సేవలు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల రోగులకు అందుబాటు ధరల్లో లభిస్తున్నట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. సీనియర్ కన్సల్టెంట్, క్లినికల్ లీడ్ డా. ఎం.డి. నదీమ్ అహ్మద్ మాట్లాడుతూ.. రక్త క్యాన్సర్లను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా, అక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా వంటి వ్యాధులకు అత్యాధునిక వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఆటోలాగస్, అల్లో జెనిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌లతో పాటు మ్యాచ్‌డ్ సిబ్లింగ్ డోనర్, మ్యాచ్‌డ్ అన్‌రిలేటెడ్ డోనర్, హాప్లోఐడెంటికల్ ట్రాన్స్‌ప్లాంట్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు.

- Advertisement -

Also Read: Kandi Shravan Reddy: హబ్సిగూడాలో ఘనంగా బంజారా సీత్లా భవాని వేడుక

రోగి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వ్యక్తిగత చికిత్స..

అదేవిధంగా, రోగి శరీరంలోని టీ-సెల్స్‌ను జన్యుపరంగా మార్పులు చేసి క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని నాశనం చేసే కార్-టి సెల్ థెరపీ సేవలను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ చికిత్స ద్వారా ల్యుకేమియా, లింఫోమా వంటి రక్త క్యాన్సర్లలో ఆశాజనక ఫలితాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విభాగాధిపతి డా. విషాల్ టోకా మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికత, నిపుణులైన వైద్య బృందంతో ప్రతి రోగి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వ్యక్తిగత చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డా. సయ్యద్ అక్బర్ కోత్వాల్ మాట్లాడుతూ.. అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నాణ్యతలో రాజీ పడకుండా అందుబాటు ధరల్లో సేవలు అందిస్తున్నామని చెప్పారు. హాస్పిటల్ సీఓఓ ప్రొఫెసర్ మహ్మద్ మసూద్ అహ్మద్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యాధునిక చికిత్సా కేంద్రాల అవసరం మరింత పెరిగిందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News