Homeతెలంగాణహైదరాబాద్Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో తీవ్ర విషాదం.. వైద్యం వికటించి విద్యార్థిని మృతి!

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో తీవ్ర విషాదం.. వైద్యం వికటించి విద్యార్థిని మృతి!

Gandhi Hospital: గాంధీ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గాంధీ ఆసుపత్రిలో వైద్యం వికటించి.. మెడికల్ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటనపై విద్యార్థిని తల్లిదండ్రులు చిలకలగూడ పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

అసలేం జరిగిందంటే: గాంధీ మెడికల్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్న పల్లవి గౌడ్ అనే యువతి.. ఈ నెల 16న ఛాతికి సంబంధించిన సమస్యతో ఆసుపత్రిలో చేరింది. దీంతో వైద్యులు ఈ నెల 17న సర్జరీ చేసి కణితి తొలగించారు. అయితే ఈ ఆపరేషన్ విఫలం అయింది. దీంతో ఈ నెల 20న ఆమెకు రెండోసారి సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలో పల్లవి మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని పల్లవి తల్లిదండ్రులకు సైతం వెల్లడించారు.

Also read-POCSO Case: ఏపీలో దారుణం.. కూతురు వరుస బాలికపై లైంగిక దాడి!

వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న తల్లిదండ్రులు: పల్లవి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అనుభవం లేని వైద్యులతో చికిత్స అందించడం వల్లే తమ కూతురు మరణించిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పల్లవి తల్లిదండ్రులు చిలకలగూడ పోలీస్ స్టేషన్‍లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేసే వరకు మృతదేహాన్ని తీసుకువెళ్లేది లేదని ఆమె బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News