Homeతెలంగాణహైదరాబాద్Talasani : ప్రత్యేక ఓటరు సవరణకు అదనపు సిబ్బందిని నియమించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani : ప్రత్యేక ఓటరు సవరణకు అదనపు సిబ్బందిని నియమించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్ (తెలుగుప్రభ): ప్రత్యేక ఓటరుసవరణ కార్య క్రమాన్ని సమర్థవంతంగా నిర్వ హించేందుకు బూత్ లెవల్ ఆఫీ సర్లు,సిబ్బంది సంఖ్యను తక్షణ మే పెంచాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశా రు.ఈ నెల 10తో సర్ కార్యక్ర మం గడువు ముగియనున్న నేప థ్యంలో వెస్ట్ మారేడ్‌పల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో సనత్‌నగర్ నియోజకవర్గ పరిధి లోని బూత్ లెవల్ ఏజెంట్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ పార్టీ శ్రేణులు, బూత్ లెవల్ ఏజెంట్లు ఇంటిం టికీ వెళ్లి ప్రతి ఓటరు ఎన్యుమరే టర్ ఫారాన్ని పూర్తి వివరాలతో సమర్పించేలా అవగాహన కల్పిం చాలని సూచించారు. కొందరు ఓటర్లకు ఫారాలు అందలేదని, మరికొందరు ఫారాలు తీసుకున్న ప్పటికీ సమర్పించలేదని పేర్కొ న్నారు.ఫారాలు అందని వారికి అందజేయడంతో పాటు, తీసుకు న్న వారు గడువులోగా సమర్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

గడువులోపు వివరాలు సమర్పించని వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించే అవకాశముందని ఎన్నికల అధికారులు చెబుతున్నారని, ఒక్క ఓటు కూడా కోల్పోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఇప్పటివరకు కేవలం 53 శాతం ప్రక్రియ మాత్రమే పూర్తైందని అధికారులు ప్రకటించారని, మిగిలిన 47 శాతం పనిని నాలుగు రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. సరైన అవగాహన లేని వారిని బీఎల్ఓలుగా నియమించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని, కొందరు బీ ఎల్ ఓలు ఇంటింటికీ వెళ్లకుండా ఒకేచోట కూర్చొని ఓటర్లను తమ వద్దకు రావాలని కోరుతున్నారని విమర్శించారు.

ఓటు హక్కు కేవలం ఎన్నికల్లో ఓటు వేయడానికి మాత్రమే కాకుండా వ్యక్తిగత గుర్తింపుగా కూడా ఉపయోగపడుతుందని, జాబితా నుంచి పేరు తొలగిపోయిన తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదని అన్నారు. సర్ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం అత్యంత ప్రాధాన్యంగా నిర్వహించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులను కూడా ఈ ప్రక్రి యలో భాగస్వామ్యం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News