Homeతెలంగాణహైదరాబాద్EO Gutta Manohar Reddy: జాతరను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు.. ఈవో గుత్తా మనోహర్...

EO Gutta Manohar Reddy: జాతరను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు.. ఈవో గుత్తా మనోహర్ రెడ్డి

సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): లక్షల మంది భక్తులు పాల్గొన్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర విజయవంతం కావడానికి చేసిన ప్రతి ఒక్కరికి ఈవో గుత్తా మనోహర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బోనాల జాతరకు నిధులు కేటాయించడంతో పాటు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసేందుకు సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ, ధర్మకర్తల మండలి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే భక్తులు అధిక సంఖ్యలో వచ్చినా అమ్మవారి దర్శనం కోసం సహనంతో వేచి చూసిన భక్తులు, పలహార బండ్ల నిర్వాహకులు, సేవలు అందించిన వాలింటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేవలం అమ్మవారిపై ఉండే భక్తితో ప్రతి ఒక్కరు నిస్వార్ధంగా సేవలు అందించారని ఆయన కొనియాడారు.

- Advertisement -

Also Read: Bapu Hills: బాపు హిల్స్‌లో కొండచిలువ కలకలం.. వీధి దీపాల లేమితో భయాందోళన

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News