Sri Rama Navami Hyderabad Traffic: శ్రీరామనవమి పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్ నగరంలో కన్నులపండువగా శోభాయాత్ర జరగనుంది. ఈ సందర్భంగా నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. శోభాయాత్ర సాగే మార్గాల్లో రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
Also Read: https://teluguprabha.net/sports-news/ipl-2026-season-19-phase-2-schedule-released/
మార్చి 27న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న మార్గాల్లో వాహనాలకు అనుమతి ఉండదు. ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లిస్తారు. సీతారాంబాగ్ దేవాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు ఇవి..
సీతారాంబాగ్, బోయిగూడ కమాన్ నుంచి మల్లేపల్లి క్రాస్ రోడ్స్ వైపు ట్రాఫిక్ మళ్లించనున్నారు. మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడి జంక్షన్ వైపు మళ్లిస్తారు. ఎంజే బ్రిడ్జి, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలను జుమేరాత్ బజార్ మీదుగా మళ్లింపు ఉంటుంది. అబిడ్స్ జీపీవో, సుల్తాన్‌బజార్, కోఠి, అబిడ్స్ ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు.

