సికింద్రాబాద్ (తెలుగు ప్రభ): ద్విచక్ర వాహనం చోరీ కేసును నాచారం పోలీసులు ఛేదించి ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి చోరీకి గురైన హీరో స్ప్లెం డర్ బైక్ (ఏపీ29 ఏహెచ్ 82 37)ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీఎస్‌టీ కాలనీలో ఇంటి ముందు ఈ నెల 24న అర్ధరాత్రి పార్క్ చేసిన బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. బాధితుడు అగెండ్ల సుధాకర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం భవానీనగర్‌లో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు.. చోరీకి గురైన బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు అరోళ్ల భరత్ (25), సిరిమిల్ల అఖిల్ (21)గా గుర్తించారు. వీరిపై గతంలోనూ పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె. ధనుంజయ్ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ బి. మాన్‌సింగ్ పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు సత్యనారాయణ, రాహుల్, అశోక్ కేసును ఛేదించారు. పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
Also Read: Inspection : లైసెన్స్ లేకుంటే ‘లాక్’.. గ్రీన్‌పార్క్‌లో కమిషనర్ ‘మెరుపు’ తనిఖీ!

