- పేద మహిళలకు సఫాయి కార్మి కులకు చీరలు పంపిణీ
సికింద్రాబాద్ (తెలుగుప్రభ): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘ కాలం పా టు ముఖ్య మంత్రిగా, ప్రధానిగా దేశాభివృ ద్ధికి, పేదల సంక్షేమా నికి,స్వచ్ఛ భారత అభియాన్, మౌలిక వస తుల కల్పనకు చేసి న కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదా య కమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొ న్నారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించు కుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వ హించిన ‘సేవా సంకల్ప్’ వారోత్స వాలు ముగిశాయి. ఈ సందర్భం గా తర్నాకలో మహం కాళి జిల్లా ఇంటెలెక్చువల్ సెల్ ఇంచార్జి డా క్టర్ శ్రీరామ్ వెంకట్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ముగింపు కార్య క్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా తార్నాక లో నిర్వహించిన ర్యాలీలో మంత్రి స్తానిక నాయకులు, ప్రజలతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వర కు నెల రోజుల పా టు దేశవ్యా ప్తంగా లక్షలాది గ్రామాలు, వేలా ది పట్టణాల్లో అనేక రకాల సేవా కార్యక్ర మాలను దిగ్విజయంగా నిర్వహించినట్లు వెల్లడించారు.
బస్తీ వాసులకు సేవా కార్యక్రమాలు..
ఈ నెల రోజుల వ్యవధిలో పేదలకు సహాయం, రైతులు, బస్తీ వాసులకు సేవలు, రక్తదాన శ్రమదానాలు, ఆసుపత్రులలో పండ్లు-పాలు పంపిణీ, పారిశుద్ధ్య, అంగన్వాడీ కార్యకర్తలను సత్కరించే అనేక సేవా కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు. పేదలు, మహిళలు, పారిశుద్ధ్య కార్మికులకు సేవ చేయడం ద్వారా సామాజిక బాధ్యతను చాటుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సేవా స్ఫూర్తితో డాక్టర్ శ్రీరామ్ వెంకట్ ప్రజల మధ్యకు వెళ్లి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహంకాళి జిల్లా ఇంటిలెక్చవల్ సెల్ ఇంచార్జి డాక్టర్ శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో తార్నాకలో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ, సమాజంలోని ప్రతి వర్గానికి అండగా నిలబడతామన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి, సామాజిక సేవకు మా వంతు కృషి చేస్తాం అని తెలిపారు. సేవా సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 15 సేవా కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా పారిశుధ్య కార్మికులు, జీహెచ్ఎంసి కార్మికులకు చీరల పంపిణీ చేశామన్నారు. తార్నాక సేవా 25’లో భాగంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తూ, సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి, తార్నాక డివిజన్ అధ్యక్షుడు కంటే కరుణాకర్, అలేటి అనూష, కృష్ణ గౌడ్, ప్రకాష్ గౌడ్, కుల శ్రీనివాస్, దేవా, రాగి శ్రీనివాస్, శివ గౌడ్, పవన్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


