Homeతెలంగాణహైదరాబాద్Bonalu : ఉప్పల్ ఆలయాలకు బోనాల తోడ్పాటు.. ఆధ్యాత్మిక వైభవానికి ఆసరాగా ప్రజా ప్రభుత్వం

Bonalu : ఉప్పల్ ఆలయాలకు బోనాల తోడ్పాటు.. ఆధ్యాత్మిక వైభవానికి ఆసరాగా ప్రజా ప్రభుత్వం

ఉప్పల్ (తెలుగుప్రభ):ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ ఆలయాలకు తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన బోనాల చెక్కులను గురువారం హబ్సిగూడలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పంపిణీ చేశారు. 

- Advertisement -

ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్  ముఖ్య అతిథిగా పాల్గొనగా, ఉప్పల్ ఎమ్మెల్యే  బండారి లక్ష్మారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులకు బోనాల చెక్కులను అందజేసి, ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని తెలిపారు.

ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని ఆలయాల పట్ల తాను ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నానని ఆలయాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు కొనసాగుతాయని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, అధికారులు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News