Homeతెలంగాణహైదరాబాద్Retirement : 37 ఏళ్ల ప్రస్థానం.. ఉప్పల్ ట్రాఫిక్ ఎస్‌ఐ పూసపల్లి ముత్తయ్యకు ఘన...

Retirement : 37 ఏళ్ల ప్రస్థానం.. ఉప్పల్ ట్రాఫిక్ ఎస్‌ఐ పూసపల్లి ముత్తయ్యకు ఘన నీరాజనం!

ఉప్పల్ (తెలుగుప్రభ): ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పూసపల్లి ముత్తయ్య సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ శాఖలో 37 సంవత్సరాలకు పైగా నిజాయితీ,నిబద్ధత, క్రమశిక్షణ, కష్టపడే తత్వంతో ప్రజలకు విశిష్ట సేవలందించి గౌరవప్రదంగా పదవీ విరమణ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా నిర్వహించిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయనతో కలిసి సేవలందించిన బ్యాచ్‌మేట్స్, బంధువులు, ఆత్మీయ మిత్రులు, ప్రత్యేకంగా ఆయనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు, ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ,ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. నాగరాజు ,రిజర్వ్ ఇన్‌స్పెక్టర్  గోవర్ధన్ ,ఉప్పల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది, ఇతర ఆహ్వానితులు హాజరై శ్రీ ముత్తయ్య విశిష్ట సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు.

ముత్తయ్య తన ఉద్యోగ జీవితమంతా కర్తవ్యనిష్ఠ, నిజాయితీ, వినయం, అంకితభావంతో సేవలందించి సహచరులకు, యువ పోలీసు అధికారులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆయన పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలు, ఆనందం, ప్రశాంతత, కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News