చార్మినార్ (తెలుగు ప్రభ): అక్కన్న మాదన్న శ్రీ మహంకాళి బోనాల ఫోటో ప్రదర్శన తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, కళావైభవానికి, ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారులు వి.హనుమంత్ రావు అన్నారు. ఆషాడ మాసం బోనాల ఉత్సవాలలో భాగంగా హరిబౌలిలోని శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయంలో శాకంబరి పూజలకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం హరిబౌలిలోని శ్రీ అక్కన్నమాదన్న మహంకాళి దేవాలయం ప్రార్థనామందిరంలో 77వ వార్షిక బోనాల ఉత్సవాల వైభవాన్ని తెలిపే ఫొటే ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ సలహాదారులు వి.హనుమంత్ రావు మాట్లాడుతూ.. ఎంతో ప్రాచీనమైన చరిత్ర కలిగిన శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి అమ్మవారిని బోనాల పండుగ సందర్భంగా సందర్శించి అమ్మవారి ఆశ్శీసులు తీసుకోవడం జరుగుతుందన్నారు. అమ్మవారి దీవెనలతో రాష్ట్రాల్లో వర్షాలు కురిసి అని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. 77 ఏళ్ళుగా ప్రదర్శనను కొనసాగించడం అద్భుతమని, ప్రదర్శనలోని ఫోటోలు హృదయానికి హత్తుకునేలా కట్టిపడేశాయన్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీక, అక్కన్నమాదన్న బోనాల ఛాయాచిత్ర ప్రదర్శన అని అన్నారు. పాతనగర అభివృధి కోసం ప్రభుత్వం మెట్రో రైలు పనులు చేపట్టడం జరుగుతుందని వి.హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు ప్రభాకర్, ఆలయ కోశాధికారి ఎ.సతీష్ కుమార్ , కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.పి క్రాంతి కుమార్, ఆలయ కమిటీ ప్రతినిధులు జి.రాజారత్నం, చేతన్ కుమార్ సూరి తదితరులు పాల్గొన్నారు.
Also Read: OU Police Station: పన్నీర్ సరఫరా వాహనం అడ్డగింత.. ఓయూ పీఎస్‌లో నలుగురిపై కేసు నమోదు


