ఉప్పల్ (తెలుగుప్రభ): మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బీజేపీ సీనియర్ నాయకులు వల్లపు జగన్ యాదవ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు జే. కె. శేఖర్ యాదవ్‌తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం, ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం మరింత నిబద్ధతతో పనిచేస్తూ, ఓబీసీ వర్గాల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో సేవలందించాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ కమిటీ సభ్యులు, జాయింట్ స్పోక్స్ పర్సన్ ఉలుగొండ నారాయణదాసు, సెక్రటరీ పిసరి శంకర్, రాజేందర్ గౌడ్, అసెంబ్లీ కో కన్వీనర్ సబిత యాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Bonalu festival: బోనాలకు బురదతో స్వాగతమా?.. భక్తి మార్గాన్ని మురుగుకాల్వగా మార్చిన నిర్లక్ష్యం

