Thursday, March 12, 2026
Homeతెలంగాణహైదరాబాద్KLH: 'వేర్ ట్రెడిషన్- మీట్స్ క్రియేటివిటీ'.. కేఎల్‌హెచ్‌లో ఘనంగా కళా ఉత్సవ్.!

KLH: ‘వేర్ ట్రెడిషన్- మీట్స్ క్రియేటివిటీ’.. కేఎల్‌హెచ్‌లో ఘనంగా కళా ఉత్సవ్.!

KLH Kala Utsav 2026: కేఎల్‌హెచ్ హైదరాబాద్ క్యాంపస్‌లో ఈ నెల 12, 13వ తేదీల్లో జాతీయ స్థాయి సాంస్కృతిక మహోత్సవాన్ని ‘కళా ఉత్సవ్ 2026’ పేరుతో అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో.. ‘వేర్ ట్రెడిషన్- మీట్స్ క్రియేటివిటీ’ థీమ్‌తో అట్టహాసంగా సాగింది. ఈ వేడుకల్లో విద్యార్థుల ప్రతిభా పాటవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

- Advertisement -

కళా ఉత్సవ్- 2026 తొలి రోజు తెలంగాణ ప్రభుత్వ భాషా , సాంస్కృతిక శాఖకు చెందిన నేహా సింగ్  బృందం ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంగీతం, నృత్యం, కళలు, సాహిత్యం, జర్నలిజం, లూమినార్– షార్ట్ ఫిల్మ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. విద్యార్థులు ప్రతి విభాగంలో అద్భుత ప్రతిభ కనబరిచారు. సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా టీం ఫన్ మోజీ వినోదాత్మక ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ గాయకుడు పవన్ కళ్యాణ్ సంగీత ప్రదర్శన ఆకట్టుకుంది. ఫ్యాషన్ షో, ఇంటర్ క్యాంపస్ సాంస్కృతిక ప్రదర్శనలు, అధికారిక బ్రోచర్ విడుదల కార్యక్రమాలతో పాటు బ్యాండ్ ప్రదర్శన ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. 

Also Read: https://teluguprabha.net/telangana/municipal-elections-congress-won-3-corporations-till-now/

ఫిబ్రవరి- 13 – గ్రాండ్ ఫినాలే

కళా ఉత్సవ్‌లో భాగంగా రెండో రోజు ముఖ్య అతిథులుగా అర్జున్ సర్జా, ఐశ్వర్య అర్జున్, నిహాంత్రి రెడ్డిలు హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. కేఎల్‌హెచ్ మ్యూజిక్ క్లబ్‌ల ప్రత్యేక ప్రదర్శనలు, లైవ్ ఆర్ట్ కార్యక్రమాలు నిర్వహించారు. యూనివర్సిటీ అధికారిక గీతం విడుదల చేశారు. అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. గ్రాండ్ డీజే నైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు, సర్టిఫికేట్లు అందజేశారు. 

ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ప్రత్యేక నగదు బహుమతులు అందించారు. విద్యార్థుల భాగస్వామ్యంతో మహోత్సవంలో కేఎల్‌హెచ్ బాచుపల్లి, అజీజ్‌నగర్, గ్లోబల్ బిజినెస్ స్కూల్ క్యాంపస్‌లతో పాటు ఇతర కళాశాలల నుంచి కూడా విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణ బృందం ఎంతో సమర్థవంతంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. 

KLH 2026

Also Read: https://teluguprabha.net/telangana/warangal-news/brs-leaders-alleged-result-tampering-in-vardhannapet-municipality/

‘కళా ఉత్సవ్’ విద్యార్థుల సృజనాత్మకతకు వేదిక అని కేఎల్ యూనివర్శిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ హవీష్ అన్నారు. విద్యతో పాటు సంస్కృతి, విలువలు, నాయకత్వం కలిసినపుడే సమగ్ర వ్యక్తిత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ మహోత్సవాన్ని స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఆధ్వర్యంలో కళా ఉత్సవ్ ఛైర్‌ పర్సన్, సాక్ డైరెక్టర్ సాయి విజయ్, కన్వీనర్ ప్రేమ్, అధ్యాపకులు, విద్యార్థి వాలంటీర్లు సమన్వయంతో సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. రెండు రోజుల పాటు సాగిన కళా ఉత్సవ్- 2026 విద్యార్థుల్లో ఐక్యత, సృజనాత్మకత, భారతీయ సాంస్కృతిక విలువలకు అద్దం పట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News