Homeతెలంగాణహైదరాబాద్Big alert: భగ్గుమంటున్న భాగ్యనగరం.. ఆరెంజ్ అలర్ట్ జారీ!

Big alert: భగ్గుమంటున్న భాగ్యనగరం.. ఆరెంజ్ అలర్ట్ జారీ!

Weather Report: రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఏప్రిల్ రెండో వారంలోనే ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో పనుల నిమిత్తం బయటకు వచ్చే ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే రానున్న 10 రోజులు మరింత ప్రమాదకరంగా ఉండనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

- Advertisement -

భగ్గుమంటున్న భాగ్యనగరం: హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే షాబాద్, మహేశ్వరంలో గరిష్ఠంగా 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్ 12 నుంచి 22 వరకు ఉష్ణోగ్రతలు 40 నుంచి 41 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మల్లాపూర్, ఉప్పల్, బాలానగర్, రాజేంద్రనగర్, ఆసిఫ్నగర్, గోల్కొండ ప్రాంతాల్లో తీవ్రమైన ఉక్కపోతతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్: రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత దృష్ట్యా వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే పది రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 41 నుండి 44 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Also read-CM Revanth Reddy: కాలమే సమాధానం చెబుతుంది.. జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం కౌంటర్!

తీసుకోవాల్సిన జాగ్రత్తలు: తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండటానికి తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్‌ఎస్ ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు ఎట్టిపరిస్థితుల్లో బయటకు రావద్దని తెలిపారు. ఒకవేళ వచ్చినా పలు జాగ్రత్తలు వహించాలని కోరారు. వీలైనంత వరకు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండటం ఉత్తమమని వైద్యులు తెలిపారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News