- దేశ ప్రజల తలరాతలు రాసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్
- ఘనంగా 36వ వారం జ్ఞానమాల కార్యక్రమం
కీసర(తెలుగుప్రభ): అంబేద్కర్ లేకుంటే మన బ్రతుకులు ఏమయ్యేవి?” అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని, దేశ ప్రజల తలరాతలను మార్చిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్ తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రాజ్యాంగ హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమం అహ్మద్‌గూడ అర్జీకే కాలనీలో ఘనంగా జరిగింది.
ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా 36వ వారం జ్ఞానమాల కార్యక్రమానికి కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కర్రె గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాల ప్రజలు ఆయనను గొప్ప జ్ఞానవంతుడిగా, మేధావిగా గుర్తించారని, భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్జీకే అంబేద్కర్ సంఘం గౌరవ అధ్యక్షుడు మంగళపురి వెంకటేష్, అధ్యక్షుడు గొల్ల రాజులు, కీసర మండల అంబేద్కర్ సంఘం కోశాధికారి రొండ్ల మహేష్, సంయుక్త కార్యదర్శి తాళ్ల కిరణ్, కీసర బిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు చినింగని బాల్ రాజ్, పెద్ద పర్వతపూర్ శశికాంత్, అర్జీకే కాలనీ వాసులు సురేష్, ప్రసాద్, సాయి బాబా, పరుశారాం, తదితరులు పాల్గొన్నారు.

