Homeతెలంగాణహైదరాబాద్Yashoda Hospitals: యశోద హాస్పిటల్స్‌కి అరుదైన ఘనత.. 'వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్' 2026లో ర్యాంకింగ్‌.!

Yashoda Hospitals: యశోద హాస్పిటల్స్‌కి అరుదైన ఘనత.. ‘వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్’ 2026లో ర్యాంకింగ్‌.!

యశోద హాస్పిటల్స్ గ్రూప్-హైదరాబాద్, ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ ‘న్యూస్ ‌వీక్ & స్టాటిస్టా’ ఆధ్వర్యంలో ప్రకటించిన “వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ 2026” ర్యాంకింగ్స్‌ జాబితాలో ప్రముఖ స్థానం సంపాదించింది. భారతదేశంలోని అత్యుత్తమ ఆస్పత్రుల్లో కూడా ఒకటిగా ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని అందుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపును యశోద హాస్పిటల్స్ గ్రూప్ వరుసగా 8వ సంవత్సరం కూడా సాధించడం ద్వారా ఆరోగ్య రంగ సేవల్లో తమ నిబద్ధత, నాణ్యతా ప్రమాణాలు, విశ్వసనీయతను మరోసారి నిరూపించింది. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/top-stories/pm-modi-bows-down-at-the-feet-of-a-senior-bjp-leader-in-west-bengal/

2026 సంవత్సరానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 2,780 ఆసుపత్రులను విశ్లేషించి ఈ ర్యాంకింగ్స్‌ను అందజేశారు. ఇందులో వైద్య సేవల నాణ్యత, రోగుల అనుభవం, ఆధునిక వైద్య సాంకేతికత, క్లినికల్ ప్రతిభ వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో యశోద హాస్పిటల్స్ గ్రూప్ ప్రముఖ స్థానం పొందడం, భారత్‌తో పాటు తెలుగు రాష్ట్రాల  వైద్య రంగంలో యశోద హాస్పిటల్స్ గ్రూప్ సాధించిన ప్రపంచస్థాయి విశిష్టతను, గౌరవాన్ని ప్రతిబింబించింది.

ప్రత్యేకంగా, “వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ 2026” జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం 7 ఆస్పత్రులు మాత్రమే చోటు దక్కించుకోగా, అందులో యశోద హాస్పిటల్స్ గ్రూప్‌నకు చెందిన సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్ ‌పేట్ యశోద మూడు ఆస్పత్రులు, భారతదేశంలోని టాప్ 100 అత్యుత్తమ ఆస్పత్రులు, వరల్డ్‌ ది బెస్ట్ & అత్యుత్తమ ఆస్పత్రుల జాబితాలో ప్రముఖ స్థానం సంపాదించడం  విశేషంగా తెలుగు రాష్ట్రాల కు గర్వకారణంగా నిలిచింది.

Also Read: https://teluguprabha.net/top-stories/suvendu-adhikari-sworn-in-as-west-bengal-cm/

ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఛైర్మన్ గోరుకంటి రవీందర్ రావు మాట్లాడుతూ.. ఈ “వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్స్ 2026” గుర్తింపు ద్వారా యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి ఆరోగ్య సేవలను అందించే విశ్వసనీయ భారతీయ ఆరోగ్యసంస్థగా మరోసారి నిలిచిందన్నారు. ఈ గుర్తింపు తమ నిరంతర కృషికి, ప్రపంచ స్థాయి వైద్య సేవలను భారత దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే తమ అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. వరుసగా 8వ సంవత్సరం ఈ అత్యున్నత గౌరవం దక్కడం తమ వైద్య బృందం, సిబ్బంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రల ప్రజలందరికి ఎంతో గర్వకారణమని వెల్లడించారు. 

yashoda

ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ వైద్య  నిపుణుల వైద్య సేవలు, మానవతా దృక్పథంతో రోగుల ఆరోగ్య ఫలితాలను మరింత మెరుగుపరచేందుకు తాము నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని గోరుకంటి రవీందర్‌ తెలిపారు. యశోద హాస్పిటల్స్ గ్రూప్ ఎల్లప్పుడూ అత్యుత్తమ ప్రపంచ స్థాయి వైద్య సేవలు ప్రజలకు అందించడంపై ఎప్పటికీ దృష్టి సారిస్తుందన్నారు. వైద్యులు, సిబ్బంది అంకితభావం, కోట్లాది రోగుల అపార విశ్వాసం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని వివరించారు. 

1989 లో సోమాజిగూడలో ప్రారంభమైన యశోద హాస్పిటల్స్ గ్రూప్ నాలుగు దశాబ్దాలుగా భారతదేశంలోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ ఆరోగ్య సేవా సంస్థల్లో ఒకటిగా నిలిచింది. గత 37 సంవత్సరాలుగా నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ దేశ విదేశాల రోగుల విశ్వాసాన్ని సంపాదించింది. సోమాజిగూడ, సికింద్రాబాద్, మలక్ ‌పేట్, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని 4 స్వతంత్ర ఆస్పత్రులు, 4500కి పైగా పడకలతో ప్రపంచ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయాలను అందిస్తోంది.  అత్యాధునిక సాంకేతికత, అత్యుత్తమ నిపుణుల వైద్య సేవలు, మానవీయ దృక్పథంతో అందుబాటులో ప్రపంచ స్థాయి వైద్య సేవలను యశోద హాస్పిటల్స్ గ్రూప్ ప్రజలకు అందుబాటులో ఉంచుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News