Suicide in Gachibowli: గచ్చిబౌలిలో యువ వ్యాపారవేత్త ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మత్తుమందు తాగి గొంతుకోసుకుని సూసైడ్ చేసుకున్నాడు. అయితే మరికొద్దిరోజుల్లో సదరు వ్యాపారవేత్త పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా.. ఇలా బలవన్మరణం చేసుకోవడంతో కుటుంబీకులు శోక సంద్రంలో మునిగిపోయారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో యువ వ్యాపారవేత్త మెట్ల వెంకట కృష్ణసాయి(30) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొండాపూర్‌లోని మైం హోం మంగళ అపార్ట్‌మెంట్‌లోని తన నివాసంలో మత్తు మందు తాగి గొంతు కోసుకుని కృష్ణ సాయి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసలు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ దారుణానికి ముందుగా మృతుడు.. తన సోదరుడికి మెసేజ్ పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సోదరుడికి మెసేజ్ చేశాడు.
Also Read: https://teluguprabha.net/national-news/kerala-puducherry-assam-elections-campaign-completed/
అయితే ఈ నెల 12న వెంకట కృష్ణసాయి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి ఇంకా అయిదు రోజులు మాత్రమే ఉండగా.. బలవన్మరణానికి పాల్పడటం కుటుంబీకుల్లో కలవరాన్ని రేకెత్తించింది. పెళ్లి పనులు జరుగుతున్న సమయంలో ఈ విషాదకర ఘటన జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

